హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): దసరా సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం 6 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేసినట్టు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. సోమవారం సంబంధిత అధికారులతో ఆయన వ ర్చువల్‌గా సమావేశమై మాట్లాడారు. 1 నుంచి 15 వరకు ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, కేపీహెచ్‌బీ, సంతోష్‌నగర్ నుంచి జిల్లాలకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్టు వెల్లడించారు. కరీంనగర్, నిజామాబాద్ మార్గాల్లో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బ స్సులను వినియోగించుకోవాలన్నారు. గ చ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ, బెంగళూరుకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు చెప్పారు. tgsrtbus.inలో ముంద స్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని సూచించారు. సమాచారం కోసం ఆర్టీసీ కాల్‌సెంటర్ నంబర్లు 040-69440000,040-23450033ను సంప్రదించాలని కోరారు.