హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : రాఖీ పండగ సందర్భంగా మహిళలు ఆర్టీసీ బస్సులను పెద్దఎత్తున వినియోగించుకున్నారని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. ఆరు రోజుల్లో 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించినట్టు తెలిపింది. ఇందులో 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు ఉన్నట్టు ప్రకటించింది.
9న రాఖీ రోజు 45.62 లక్షల మంది, 11న 45.94 లక్షల మంది మహిళలు రాకపోకలు సాగించినట్టు చెప్పింది. గత ఏడాది రాఖీకి 2.75 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణం చేయగా, ఈ ఏడాది 3.68 కోట్లకు పెరిగినట్టు స్పష్టంచేసింది. గతేడాదితో పోలిస్తే 92.95 లక్షల మంది ఎక్కువగా ప్రయాణించినట్టు తెలిపింది.