Road Accident | హైదరాబాద్ : కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండల పరిధిలో శనివారం ప్రమాదం జరిగింది. నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు సదాశివపల్లి వద్ద లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఆర్టీసీ బస్సులో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరైతే గాయపడ్డారో వారిని కరీంనగర్ జిల్లా ఆస్పత్రికి 108 అంబులెన్స్‌లో తరలించారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.