TGPSC | హైదరాబాద్ అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): పరీక్షల నిర్వహణలో గత వైఫల్యాల నుంచి టీజీపీఎస్సీ తప్పులు సరిదిద్దుకోవడంలేదని, అదే విధమైన నిరక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నదంటూ మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. గ్రూప్-1 ప్రాథమిక కీలో 7 ప్రశ్నలకు సమాధానాల్లో తప్పులున్నాయని వాటిని సవరించాలన్న వినతులను పట్టించుకోకపోవడాన్ని సవాలు చేస్తూ పలువురు అభ్యర్థులు రెండు పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిపై జస్టిస్ ఫుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు. టీజీపీఎస్సీ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు జీ శివ, జై సుధీర్ వాదించారు. టీజీపీఎస్సీ వాదనల నిమిత్తం విచారణ మూడో తేదీకి వాయిదా పడింది.
డాక్టర్ కే శ్రీనివాసరావుకు ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డు
హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు ప్రతిష్టాత్మక ‘ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డు’ లభించింది. పుస్తక ప్రచురణ రంగంలో విశేషంగా కృషి చేసిన వారికి భారత ప్రచురణకర్తల సమాఖ్య ఏటా ఈ పురసారం అందజేస్తుం ది. ఢిల్లీలో ప్రచురణకర్తల సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో ‘ప్రచురణ మిత్ర’ పురసారాన్ని సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ హిమా కోహ్లీ ప్రదానం చేశారు.