Sonam Kapoor | రెండో బిడ్డకు స్వాగతం పలుకుతున్న సోనమ్ కపూర్ .. అట్టహాసంగా సీమంతం వేడుక
Sonam Kapoor | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ప్రస్తుతం తన జీవితంలోని అత్యంత ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్నారు. వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాతో వివాహ బంధంలో ఉన్న సోనమ్, రెండో బిడ్డకు జన్మనివ్వబోతుండగా ఫిబ్రవరి 8న ఆమె నివాసంలో సీమంతం (గోద్ భరాయ్) వేడుక ఘనంగా నిర్వహించారు.
Sonam Kapoor | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ప్రస్తుతం తన జీవితంలోని అత్యంత ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్నారు. వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాతో వివాహ బంధంలో ఉన్న సోనమ్, రెండో బిడ్డకు జన్మనివ్వబోతుండగా ఫిబ్రవరి 8న ఆమె నివాసంలో సీమంతం (గోద్ భరాయ్) వేడుక ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక సంప్రదాయబద్ధంగా, ఎంతో హుందాగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
సీమంతం వేడుకలో సోనమ్ కపూర్ లెమన్ గ్రీన్ కలర్ లెహంగా చోళీలో మెరిసిపోయారు. ‘ప్రెగ్నెన్సీ గ్లో’తో ఆమె అందం మరింత ప్రత్యేకంగా కనిపించింది. భారీ ఆభరణాలు, సంప్రదాయ జడతో సోనమ్ ఒక గజలక్ష్మిలా దర్శనమిచ్చారు. పూజ సమయంలో భర్త ఆనంద్ ఆహుజా ఆమెను చూసి మురిసిపోవడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ఇంటి లోపలి అలంకరణ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పైకప్పు నుంచి వేలాడే ఊదా రంగు పూల అలంకరణలు, ‘బర్డ్ ఆఫ్ ప్యారడైజ్’ పూల అమరికలతో ఇల్లు మొత్తం ఒక అందమైన ఉద్యానవనంలా కనిపించింది. సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సోనమ్తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ, “ప్రియమైన సోనమ్… నీ సీమంతం వేడుకకు నా ప్రేమ, ఆశీస్సులు” అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ బేబీ షవర్ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కరీనా కపూర్, భూమి పెడ్నేకర్, షబానా అజ్మీతో పాటు సోనమ్ కుటుంబ సభ్యులు అర్జున్ కపూర్, ఖుషీ కపూర్, అన్షులా కపూర్, మహీప్ కపూర్ వంటి వారు పాల్గొని సందడి చేశారు. కుటుంబ వాతావరణంలో జరిగిన ఈ వేడుకలో ఆనందం, ఆప్యాయత స్పష్టంగా కనిపించాయి. సోనమ్ కపూర్, ఆనంద్ ఆహుజాల పరిచయం 2015లో ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సినిమా ప్రమోషన్స్ సమయంలో మొదలైంది. ఫోన్ మెసేజ్లతో మొదలైన వారి స్నేహం ప్రేమగా మారి 2018లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. 2022లో వీరికి కుమారుడు ‘వాయు’ జన్మించాడు. అనంతరం గతేడాది నవంబర్లో ప్రిన్సెస్ డయానాను తలపించేలా పింక్ డ్రెస్లో ఫోటోషూట్ చేసి రెండోసారి తల్లి కాబోతున్నట్లు సోనమ్ ప్రకటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

