Tej Pratap Yadav | అదంతా తప్పుడు ప్రచారం.. నాపై కుట్ర జరుగుతోంది : తేజ్ ప్రతాప్ యాదవ్
Tej Pratap Yadav | అనుష్కా యాదవ్ అనే మహిళతో తాను రిలేషన్షిప్లో ఉన్నట్లు, ఇప్పుడు ఆమెతో తాను కుమార్తెను కన్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) పెద్ద కుమారుడు, ఆర్జేడీ బహిష్కత నాయకుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) తెలిపారు.
Tej Pratap Yadav : అనుష్కా యాదవ్ అనే మహిళతో తాను రిలేషన్షిప్లో ఉన్నట్లు, ఇప్పుడు ఆమెతో తాను కుమార్తెను కన్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) పెద్ద కుమారుడు, ఆర్జేడీ బహిష్కత నాయకుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) తెలిపారు. ఆర్జేడీ నేతలు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
అనుష్కా యాదవ్ అనే మహిళతో తనకు సంబంధాలు ఉన్నట్లు వస్తున్న వార్తలపై తేజ్ ప్రతాప్ అభ్యంతరం తెలిపారు. ఆధారరహితంగా వదంతులు వ్యాప్తి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కుట్ర వెనక మహువా నియోజకవర్గ ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేశ్ రోషన్ ఉన్నాడన్నారు. తన సోదరుడు తేజస్వీ యాదవ్కు సన్నిహితులైన పలువురు ఆర్జేడీ నేతలు తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీయడానికి కుట్ర పన్నుతున్నారని చెప్పారు.
అందులో భాగంగానే ఓ మహిళతో తనకు అక్రమ సంబంధం ఉన్నట్లు తప్పుడు వార్తలు సృష్టించి పార్టీ నుంచి బహిష్కరించేలా చేశారని తేజ్ ప్రతాప్ ఆరోపించారు. ఇప్పుడు ఆ మహిళకు కుమార్తె పుట్టినట్లు వస్తున్న వార్తలు తనను తీవ్ర వేదనకు గురి చేస్తున్నాయన్నారు. ఈ విషయంపై కోర్టుకు వెళ్తానని తెలిపారు. తేజ్ ప్రతాప్ 2018లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా రాయ్ మనవరాలు ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు.
అయితే వీరి మధ్య విభేదాలు రావడంతో కొన్నేళ్లుగా విడిగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల సమయంలో తేజ్ ప్రతాప్ ఫేస్బుక్లో ఆయన ఒక మహిళతో ఉన్న ఫొటో ప్రత్యక్షమైంది. ఆమె పేరు అనుష్క యాదవ్ అని, గత 12 ఏళ్లుగా తాము రిలేషన్లో ఉన్నట్లు ఆ పోస్టులో ఉండడంతో అది అప్పట్లో వైరల్గా మారింది. దీనిపై తేజ్ప్రతాప్ స్పందిస్తూ.. ఎవరో తన సోషల్ మీడియా ఖాతాను హ్యాక్ చేశారని అన్నారు. ఆ పోస్టులోని ఫొటో సైతం ఎడిట్ చేసినదేనని చెప్పారు. ఈ క్రమంలో ఇప్పుడు వారికి కుమార్తె పుట్టినట్లు వార్తలు రావడం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

