హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : పోటీ పరీక్షలు సహా గ్రూప్స్ సిలబస్ మారనున్నదా? కొన్ని అంశాలను తొలగించనున్నారా? అంటే అవుననే సం కేతాలు వెలువడుతున్నాయి. సిలబస్ సహా ఇతర సంస్కరణలపై టీ జీపీఎస్సీ బుధవారం ఉన్నతస్థా యి సమావేశాన్ని నిర్వహించనున్నది.
అన్ని యూనివర్సిటీల వీసీ లు, ఉన్నత విద్యామండలి అధికారులతో భేటీ కానున్నది. ఈ భేటీలో వర్సిటీల్లో అమలవుతున్న సిలబస్, టీజీపీఎస్సీ సిలబస్ అంశాలపై చర్చించనున్నట్టు తెలిసింది. 2015 తర్వాత సిలబస్ మార్పునకు కసరత్తు చేయడం ఇదే తొలిసారి.