TGPSC : గ్రూప్-1 ఫలితాల విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డికి TGPSC పరువునష్టం దావా నోటీసులు జారీచేసింది. తమ నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇచ్చి, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఒకవేళ వారం రోజుల్లో సమాధానం చెప్పకపోతే పరువునష్టం కేసులు, ఇతర క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని హెచ్చరించింది.
అంతేగాక ఇకపై TGPSCపై రాకేష్ రెడ్డి ఎలాంటి ఆరోపణలు చేయవద్దని ఆదేశించింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టవద్దని తన ఆదేశాల్లో పేర్కొన్నది. కింద జత చేసిన టీజీపీఎస్సీ నోటీసులలో పూర్తి వివరాలు ఉన్నాయి.