TGPSC | హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ‘ఉద్యోగాలు భర్తీ చేసే పబ్లిక్ సర్వీస్ కమిషనే సగం ఖాళీగా ఉన్నది. మేం పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. కొత్త పోస్టులను మంజూరు చేస్తాం’ ఇదీ సీఎం రేవంత్‌రెడ్డి గతంలో చెప్పిన మాటలు. కానీ, అధికారంలోకి వచ్చిన 11నెలల తర్వాత కూడా టీజీపీఎస్సీని సగం ఖాళీగా ఉంచారు. 11 మంది సభ్యులుండాల్సిన కమిషన్‌ను ఇప్పుడు సగం సభ్యులతోనే నడుపుతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా కొత్తగా 142 పోస్టులను క్రియేట్ చేస్తూ ప్రభుత్వం జీవోను జారీచేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ జీవోను జారీచేయగా ఇవన్నీ నేరుగా భర్తీచేసేవి కావు. వీటిలో కేవలం 73 పోస్టులను కొత్తగా రిక్రూట్ చేయనుండగా, 58 పోస్టులను ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకుని నింపనున్నారు. మిగతా 11 పోస్టులను పదోన్నతులిచ్చి నింపుతారు. ఇలా అయితే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసినట్టు అవుతుందా అంటూ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
అడిషనల్ సెక్రటరీ -1, డిప్యూటీ సెక్రటరీ -3, అసిస్టెంట్ సెక్రటరీ -2, సెక్షన్ ఆఫీసర్ -4, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – 5, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు -1, చీఫ్ అనలెటిక్ ఆఫీసర్ -1, అనలెటికల్ ఆఫీసర్ -2, డిప్యూటీ అనలెటికల్ ఆఫీసర్ -4, అసిస్టెంట్ అనలెటికల్ ఆఫీసర్ -8, లా ఆఫీసర్ -1, ప్రొఫెసర్ -3, అసోసియేట్ ప్రొఫెసర్ -1, అసిస్టెంట్ ప్రొఫెసర్ -5, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ -2, ప్రాజెక్ట్ మేనేజర్ -1, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ -1, ప్రోగ్రామర్ -3, జూనియర్ ప్రోగ్రామర్ -4, స్టాటిస్టికల్ ఆఫీసర్ -4, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ -2.
రిక్రూట్చేసే పోస్టులు – 73
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ -26, జూనియర్ అసిస్టెంట్ -41, ప్రోగ్రామర్ -2, జూనియర్ ప్రోగ్రామర్ -4
పదోన్నతులిచ్చి భర్తీ చేసేవి – 11
జాయింట్ సెక్రటరీ-2, డిప్యూటీ సెక్రటరీ-2, అసిస్టెంట్ సెక్రటరీ-3, సెక్షన్ ఆఫీసర్ -4