TGPSC | హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాల్లో పసలేదని.. అంతా డొల్లేనని టీజీపీఎస్సీ తేల్చింది. ఈ పుస్తకాలు పోటీపరీక్షలకు పనికిరావని, వీటిని ప్రామాణికంగా తీసుకోలేమని పేర్కొన్నది. అకాడమీ ముద్రించిన పుస్తకాలు రన్నింగ్ నోట్స్‌లా ఉన్నాయని, ఎలాంటి రీసెర్చ్ చేయకుండా రాశారని, ఇవి కేవలం గైడ్‌లా మాత్రమే ఉపయోగపడతాయని స్ప ష్టంచేసింది. ఈ అంశాలను పేర్కొంటూ ఇటీవలే టీజీపీఎస్సీ హైకోర్టులో ఆఫిడవిట్ సమర్పించింది.
ఒక ప్రభుత్వ రంగ సంస్థ ముద్రించిన పుస్తకాలను ఒక చట్టబద్ధమైన సంస్థ అంగీకరించబోమని చెప్పడంతో నిరుద్యోగుల్లో ఆం దోళన నెలకొన్నది. ఇప్పటికే తెలుగు అకాడమీ పుస్తకాలను చదివిన వారు ఏం చేయాలో తోచ క తలలుపట్టుకుంటున్నారు. గ్రూప్-1 ప్రిలి మ్స్ ఫైనల్ ‘కీ’లోని నాలుగు ప్రశ్నల ఆన్సర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఐదుగురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. 68,79, 106, 112 ప్రశ్నల సమాధానాలపై వారు అ భ్యంతరాలు వ్యక్తంచేశారు.
ఇందుకు తెలుగు అకాడమీ ప్రచురించిన తెలంగాణ హిస్టరీ-కల్చర్ 2016, తెలంగాణ రీజినల్ జాగ్రఫీ, పుస్తకాలను రెఫరెన్స్‌గా పేర్కొన్నారు. ఈ పుస్తకాల్లోని అంశాల ఆధారంగా ఫైనల్ ‘కీ’లో మార్పు లు చేయాలంటూ కోర్టు మెట్లెక్కారు. దీంతో తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాల్లో ఎ లాంటి రెఫరెన్స్‌లు లేవని, రీసెర్చ్వర్క్ చేయలేదని పలు అభ్యంతరాలతో టీజీపీఎస్సీ ఇటీవలే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. తెలంగాణ హిస్టరీ-కల్చర్ 2016 పుస్తకంలో 33 చా ప్టర్లతో.. పూర్వ చారిత్రక కాలం నుంచి ఆధుని క కాలం వరకు అనేక వాస్తవాలను స్ఫురించా రు. 16 మంది అకాడమిషన్లు రూపొందించ గా, ముగ్గురు సీనియర్ అకాడమిషన్లు ఎడిట్చేశారు. ఏ పాఠాన్ని ఏ అకాడమిషన్ రచించా రో వ్యక్తపరచలేదని అఫిడవిట్లో పేర్కొన్నది.