TGPSC | హైదరాబాద్, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీ కోసం పరీక్ష తేదీలను టీజీపీఎస్సీ కొత్తగా విడుదల చేసింది. ఈ పరీక్షలను డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం వెబ్‌నోట్ విడుదల చేసింది.
ఈ పరీక్షలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ 1, 3, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30గంటల వరకు పేపర్ 2, 4 పరీక్షలు నిర్వహించనున్నారు.
పేపర్-1
జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ
డిసెంబర్ 15, 2024 (ఉదయం)
పేపర్-2
హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ
డిసెంబర్ 15, 2024 (మధ్యాహ్నం)
పేపర్-3
ఎకనామిక్స్ అండ్ డెవలప్మెంట్
డిసెంబర్ 16, 2024 (ఉదయం)
పేపర్-4
తెలంగాణ మూవ్మెంట్అండ్ స్టేట్ ఫార్మేషన్
డిసెంబర్ 16, 2024 (మధ్యాహ్నం)