హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సందర్భంగా బదిలీ అయి న అధికారులను వెనక్కి రప్పించాలని తె లంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను విడుదల చేయాల ని డిమాండ్ చేసింది.
టీజీవో కేంద్ర సం ఘం కార్యవర్గ అత్యవసర సమావేశాన్ని శుక్రవారం నాంపల్లిలోని టీజీవోభవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అ ధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎనుగుల సత్యనారాయణ మా ట్లాడుతూ.. ఈహెచ్ఎస్ పథకాన్ని అమలుచేసి, ప్రస్తుతమున్న మెడికల్ రీయింబర్స్మెంట్ గడువు కాలాన్ని పొడిగించాలని కో రారు.
అన్నిశాఖల్లో పదోన్నతులు కల్పించాలని తీర్మానాలు చేశారు. సమావేశంలో అ సొసియేట్ అధ్యక్షుడు బీ శబ్యూమ్, ఉపాధ్యక్షుడు జగన్మోహన్రావు, కోశాధికారి ఎం ఉపేందర్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీ పరమేశ్వర్‌రెడ్డి, దీపారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మాచర్ల రామకృష్ణగౌడ్, యాదగిరి, పలు జిల్లాల డిపార్ట్మెంటల్ ఫోరమ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.