TG Weather | తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. చలి పరిస్థితులు తగ్గడంతో ఉష్ణోగత్రలు పెరుగుతూ వస్తున్నాయి. ఫిబ్రవరిలోనే వేసవిని తలపిస్తున్న ఎండలు మండుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 32 నుంచి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో తేమశాతం తగ్గడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లుగా వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు. సాధారణం కన్నా నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నట్లుగా తెలిపారు. హైదరాబాద్, నిజామాబాద్, హన్మకొండ, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగాయి.
రాబోయే వారం రోజుల వరకు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఉక్కపోతతో జనం ఇబ్బందులకు గురవుతున్నారు. ఫిబ్రవరిలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మండు వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందేమోనని ఆందోళనకు గురవుతున్నారు. ఇక గతేడాది భారీగా ఉష్ణోగ్రతలు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డయ్యింది. ఈ నేపథ్యంలోనే ఈ వేసవిలోనూ అదే తరహాలో ఉష్ణోగ్రతలు భారీగా రికార్డయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Gongadi Trisha | క్రికెటర్ గొంగడి త్రిషకు రూ.కోటి నజరానా.. అభినందించిన సీఎం
SCR Good News | తెలుగు రాష్ట్రాలకు రైల్వే గుడ్న్యూస్.. ఇకపై ఆ స్టేషన్లలో రైళ్లు హాల్ట్