హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): విద్యాశాఖ నిర్లక్ష్యంపై టెట్ అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం నుంచి టెట్ హాల్ టికెట్లు జారీ చేస్తామని, అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ తొలుత ప్రకటించింది.
దీంతో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లారు. రాత్రి 7 దాటినా హాల్టిక్కెట్లను అప్లోడ్ చేయకపోవడంతో గంటల తరబడి నిరీక్షించారు. అయినా ఫలితం లేకపోవడంతో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకటించి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని నిలదీశారు.