హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా 369 ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ప్రైవేట్‌రంగం వీటిని ఏర్పాటు చేయనున్నది. ఈ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ, అప్‌గ్రేడేషన్, వాణిజ్య నిర్వహణ కోసం ప్రైవేట్ చార్జింగ్ పాయింట్ ఆపరేటర్లను ఆహ్వానిస్తూ టీజీ రెడ్కో టెండర్లు ఆహ్వానించింది.
హైదరాబాద్‌లో 200, ఉత్తర డిస్కంలో 169 చొప్పున స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు రెడ్కో సీఎండీ ఫారూఖీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేటర్లో ఆరు క్లస్టర్లల్లో వీటిని ఏర్పాటు చేయనున్నామని.. పదేండ్లపాటు కాంట్రాక్ట్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. యూనిట్‌కు రూ.13 చార్జింగ్ టారిఫ్ అమల్లో ఉంటుందని వెల్లడించారు.