TG ICET | హైదరాబాద్ : రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన టీజీ ఐసెట్-2024 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. ఇంకా 4,448 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
ఈ నెల 20, 21 తేదీల్లో రిజిస్ట్రేషన్‌తోపాటు ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు 21, 22 తేదీల్లో వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలి. 22వ తేదీన ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 25వ తేదీలోపు సీట్లను కేటాయిస్తారు. 25 నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్లో ఫీజును చెల్లించాలి. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 25-28 తేదీల్లో ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. సెప్టెంబర్ 27వ తేదీన స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి మార్గదర్శకాలు విడుదలవుతాయి.
ఇవి కూడా చదవండి..
Dasara Holidays | దసరా సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఎప్పట్నుంచంటే..?
TG EAPCET 2024 | బీ ఫార్మసీ, ఫార్మ్ డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
Harish Rao | రుణమాఫీ కోసం పోరుబాట పట్టిన రైతన్నల అరెస్ట్.. తీవ్రంగా ఖండించిన హరీశ్‌రావు