TG ICET | హైదరాబాద్ : రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఐసెట్ తుది విడుత సీట్ల కేటాయింపు పూర్తయింది. ఈ ఏడాది ఎంసీఏ కోర్సుల్లో 87.5శాతం, ఎంబీఏలో 90.8 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మొత్తంగా 90.2 శాతం సీట్లు భర్తీ కావడం విశేషం.
ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు కలిపి మొత్తం 35,311 సీట్లు ఉండగా, 31,842 సీట్లు నిండాయి. ఇక 3,469 సీట్లు మాత్రమే మిగిలాయి. 99 కాలేజీల్లో వందశాతం సీట్లు నిండాయి. సీట్లు పొందిన విద్యార్థులంతా ఈ నెల 27లోపు ఫీజు చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్‌రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు. ఫీజు చెల్లించిన వారంతా ఈ నెల 28వ తేదీలోపు విద్యార్హత సర్టిఫికెట్లను కాలేజీల్లో సమర్పించాలని సూచించారు. లేని పక్షంలో ఆటోమేటిక్‌గా సీటు క్యాన్షిల్ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు. తదితర వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌ను https://tgicet.nic.in లాగిన్ అవొచ్చు.
ఇవి కూడా చదవండి..
KTR | దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు ఉంది.. బండి సంజయ్‌పై కేటీఆర్ ఫైర్
KTR | అనగనగా ఓ చిట్టి నాయుడు.. ఆయనకు ఏడుగురు అన్నదమ్ముళ్లు.. రేవంత్ కథ ఇదీ..!
Harish Rao | ట్రిపుల్ ఆర్ బాధితులకు న్యాయం చేయండి.. కాంగ్రెస్ సర్కార్‌కు హరీశ్‌రావు డిమాండ్