హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, టీజీ ఐసెట్ అడ్మిషన్స్ కన్వీనర్ శ్రీదేవసేన మాసబ్ట్యాంకులోని టీజీసీహెచ్ఈ కార్యాలయంలో శనివారం ఐసెట్ షెడ్యూల్ విడుదల చేశారు. సెప్టెంబర్ 1 నుంచి 8వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ఉంటుంది. 3-9వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, 4 నుంచి 11వరకు వెబ్ఆప్షన్లకు, 14న తొలిదశ సీట్ల కేటాయింపు ఉంటుంది.
31వరకు ‘యానిమేషన్’ దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్, ఆగస్టు24 (నమస్తే తెలంగాణ): బీసీ గురుకుల ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో యానిమేషన్ కోర్సులో ప్రవేశాలకు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సెక్రటరీ సైదులు శనివారం ప్రకటనలో వెల్లడించారు. ఇంటర్ పూర్తిచేసినవారు అర్హులని, https://mjptbcwreis.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 90326 44463, 90632 42329 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
ఇంటర్నల్ స్లైడింగ్లో 5,579 సీట్లు మార్పు
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ కాలేజీల్లో ఇంటర్నల్ స్లైడింగ్లో 5,579 మంది విద్యార్థులు సీట్లు మార్చుకున్నట్టు టీజీ ఎప్సెట్ అడ్మిషన్ల కన్వీనర్ శ్రీదేవసేన శనివారం ప్రకటనలో తెలిపారు. 5,579 మందికి సీట్లు మార్చామని, 11,836 సీట్లు మిగిలాయని పేర్కొన్నారు. సీట్లు పొందిన వారు నేడు రిపోర్టు చేయాలని సూచించారు.