Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటలో ఇండస్ట్రీయల్ పార్క్ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భూసేకరణ చేపట్టవద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట, లగచర్ల, పోలెపల్లి, రోటిబండతండా, పులిచర్లకుంటతండా పరిధిలో సుమారు 1358.37 ఎకరాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గత ఏడాది ఆగస్టులో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు కంపెనీ కోసం భూసేకరణ అంటూ ఆరోపణలు రావడం, లగచర్ల రైతుల పోరాటం నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. లగచర్ల, పోలేపల్లిలో ఫార్మా విలేజ్ నోటిఫికేషన్ను ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించింది. ఈ క్రమంలోనే మళ్లీ ఇండస్ట్రీయల్ కారిడార్ పేరిట హకీంపేటలో భూసేకరణ చేయడానికి సిద్ధమైంది. దీంతో పలువురు రైతులు భూసేకరణకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. భూసేకరణ ప్రక్రియకు స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది. తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS పోరాటంతో.. కొడంగల్లో రేవంత్ అరాచకాలకు అడ్డుకట్ట పడ్డది.
తన అల్లుడి ఫార్మా కంపెనీల కోసం లగచర్ల, హకీంపేట గ్రామాల్లో గిరిజన రైతులపై దౌర్జన్యానికి పాల్పడి, అక్రమంగా జైల్లో నిర్బంధించిన రేవంత్
గిరిజన రైతులకు అన్నీ తానై అండగా నిలిచి రేవంత్… pic.twitter.com/cKkFvggcrM
— BRS Party (@BRSparty) March 6, 2025