Ghosh Commission | కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే అంశంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను సస్పెండ్‌చేయాలని కోరుతూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. కమిషన్ నివేదికపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శైలేంద్రకుమార్ జోషి నీటిపారుదల శాఖలో ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. తన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనాన్ని కోరారు. ఈ పిటిషన్‌పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. ఘోష్ కమిషన్ రిపోర్టు మీకెలా వచ్చిందని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. కాగా పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. కమిషన్ నివేదికపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్కే జోషిని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.
జూలై 31న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిందని, ఈ నివేదికలోని ముఖ్యాంశాలను ప్రభుత్వం సంక్షిప్తం చేయించాక నేరుగా పాలకులు మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్లో బహిర్గతం చేశారని పిటిషన్లో పేరొన్నారు. ఆగస్టు 4వ తేదీ నాటి పవర్ పాయింట్ ప్రజంటేషన్ సారాంశాన్ని, వెబ్‌సైట్స్ నుంచి దాని తొలగింపునకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం పిటిషనర్‌పై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కమిషన్ నివేదిక అమలును నిలిపివేయాలని కూడా విజ్ఞప్తిచేశారు. కమిషన్ తనను సాక్షిగా మాత్రమే విచారణకు పిలిచిందని, ఈ మేరకు సమన్లు ఇచ్చిందని చెప్పారు. అభియోగాలు చేసే ముందు కమిషన్ ఎలాంటి నోటీసు ఇవ్వలేదని తెలిపారు. సాక్షిగా విచారణకు పిలిచి నివేదికలో ఆరోపణలు చేయడం హకులను హరించడమేనని చెప్పారు. కమిషన్ నిర్దిష్ట ఆరోపణలు చేసే ముందు క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు ఆసారం ఇవ్వలేదని తప్పుపట్టారు. ఐఏఎస్ అధికారిగా చేసిన తన వ్యక్తిగత జీవితానికి కళంకం కలిగించేలా కమిషన్ వ్యవహరించడానికి వీల్లేదని తెలిపారు. 1984 నుంచి 31-12-2019న పదవీ విరమణ చేసేవరకు తెలంగాణలో తాను ఎంతో నిజాయితీగా పనిచేసినట్టు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అత్యంత కీలకమైన ఉన్నత పదవులను సమర్ధంగా నిర్వహించినట్టు వివరించారు. పదవీ విరమణ తర్వాత జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ పేరుతో తనకు అపకీర్తి వచ్చేలా నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. తక్షణమే కమిషన్ నివేదిక అమలును నిలిపివేస్తూ ఆదేశించాలని కోరారు.