హైదరాబాద్ జూలై 7 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పరీక్షపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు సోమవారం పూర్తయ్యాయి. గ్రూప్-1 పరీక్షలను రద్దుచేయాలని కొందరు, రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులు వేసిన పిటిషన్లపై ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు.
21 వేల మంది పరీక్ష రాస్తే 5 వేల మందికే రీవాల్యుయేషన్ జరపడం వివక్షకిందకు వస్తుందని స్పష్టంచేశారు. టీజీపీఎస్సీ తరఫు న్యాయవాదులు స్పందిస్తూ అవకతవకలు జరిగాయన డానికి ఆధారాలు చూపలేదని, అభ్యర్థులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సందేహాలున్న చోట్ల మూ ల్యాంకనం జరిగిందని, తెలుగులో రాసినవా రు తక్కువమంది అర్హత పొందారనే వాదన సరికాదనన్నారు. తీర్పు తర్వాత వెలువరిస్తామని జస్టిస్ రాజేశ్వర్రావు ప్రకటించారు.