TG Group-1 | గ్రూప్-1 అభ్యర్థులు మరోసారి నిరసనకు దిగారు. గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. గతంలో జరిగిన పిలిమ్స్ పరీక్షల్లో తప్పులు, జీవో 29 సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు నిరసన చేపట్టారు. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనతో అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్లపై అభ్యర్థులు రావడంతో.. భారీగా పోలీసులను మోహరించారు. ఇప్పటి వరకు దాదాపు మంది అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కి తరలించారు. గ్రూప్-1 మెయిన్ పరీక్షలకు ఇటీవల హైకోర్టు అనుమతి ఇచ్చింది. గ్రూప్-1 నోటిఫికేషన్లు సవాల్ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.
అదే సమయంలో ప్రిలిమ్స్‌పై దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా ఈ నెల 21 నుంచి జరుగనున్నాయి. ప్రిలిమ్స్‌లోని ఏడు ప్రశ్నలకు తుది ‘కీ’లో సరైన జవాబులు ఇవ్వలేదని పిటిషనర్స్ హైకోర్టును ఆశ్రయించింది. వాటికి మార్కులు కలిపి మళ్లీ కొత్త జాబితా ఇవ్వాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ప్రిలిమ్స్‌కి, రిజర్వేషన్ల జీవో 33, తదితర అంశాలపై మొత్తంగా గ్రూప్-1పై హైకోర్టులో దాదాపు 15కిపైగా కేసులు నమోదయ్యాయి. వాటన్నింటిని కోర్టు కొట్టివేసింది. హైకోర్టు పిటిషన్లు కొట్టివేడయంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు హాజరవనున్నారు.