Dharani Portal | హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్‌లో గుట్టలుగా పేరుకుపోతున్న పెండింగ్ సమస్యలు పరిష్కారం కాకపోవడానికి ఒక ఉన్నతాధికారి అనుసరిస్తున్న వైఖరే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదటినుంచీ ఆయన ధరణిలో మార్పులకు అడ్డం పడుతున్నారని రెవెన్యూ వర్గా ల్లో చర్చ జరుగుతున్నది. కాస్త పెద్దదైన ఏ సమస్య పరిష్కారం కోసమైనా ప్రస్తుతం అందరూ తన వద్దకే రావాల్సి ఉన్నదని, పోర్టల్‌లో మార్పులు, చేర్పులు చేస్తే తన ఆటలు సాగవనే భయంతో ఇలా వ్యవహరిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నా యి.
పెండింగ్ సమస్యలు గుట్టలుగా పేరుకుపోవడానికి కారణం కూడా ఆయనేనన్న అభియోగాలు ఉన్నాయి. ప్రభు త్వం ఈ ఏడాది మార్చిలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఆ సమయంలో ధరణి కమిటీ స భ్యులు ‘తహసీల్దార్లకు, ఆర్డీవోలకు, అదనపు కలెక్టర్లకు అధికారాలు ఇవ్వకుండా పెండింగ్ దరఖాస్తులు క్లియర్ చేయడం సాధ్యం కాదు’ అని ఆ ఉన్నతాధికారికి స్పష్టం చేసినట్టు సమాచారం. కానీ, ఆయన ఆ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపా యి. దీంతో పోర్టల్‌లో ఎలాంటి మార్పు లు జరగలేదని, ఫలితంగా పెండింగ్ దరఖాస్తులు పరిష్కారం కాకపోగా మరో లక్ష అదనంగా చేరాయని చెప్తున్నాయి. చివరికి ధరణిలో పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఇటీవలే తహసీల్దార్లకు, ఆర్డీవోలకు, అదనపు కలెక్టర్లకు అధికారాలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదే పని నాలుగైదు నెలల కిందటే చేసి ఉంటే పెండింగ్ దరఖాస్తులు గుట్టలుగా పేరుకుపోయేవి కాదని చెప్పుకుంటున్నారు. ఆ అధికారి వల్లే ఇంత ఆల స్యం అయ్యిందని ఆరోపిస్తున్నారు. పోర్టల్‌లో మార్పులు చేర్పులు చేసి సులభత రం చేయాలని, అప్పుడే పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం సాధ్యం అవుతుందని కమిటీలోని ఒకరిద్దరు సభ్యులు సదరు ఉన్నతాధికారికి పదే పదే చెప్పినట్టు స మాచారం. కానీ, ఆయన పెడచెవిన పెట్టడంతో సలహాలు ఇవ్వడం మానేసినట్టు గుసగుసలున్నాయి.
ఇక, పోర్టల్‌ను ప్రైవే ట్ కంపెనీ నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో ని ఎన్ఐసీకి అప్పగించే విషయంలోనూ ఆ అధికారి ప్రభుత్వాన్ని తప్పుదోవ ప ట్టించారనే ఆరోపణలున్నాయి. బదిలీ ఎ ప్పుడో జరగాల్సి ఉన్నా, నిబంధనల పేరు చెప్పి అడ్డుకున్నారని, చివరికి ఒప్పందం గడువు ముగిసినా ఒక నెల ఆలస్యం కావడం వెనుక కూడా ఆయన చక్రం తిప్పినట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో కుదిరిన ఒప్పందం మేరకు ఆదివారం నుంచి ధరణి పోర్టల్ నిర్వహణ ఎన్ఐసీ చేతికి వెళ్లనున్నది.