Musi Beautification : మూసీ సుందరీకరణపై విమర్శలు వెల్లువెత్తుతున్నా మొండిగా ముందుకు వెళ్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం తదుపరి కార్యాచరణ ప్రకటించింది. పేదల ఇళ్లను కూల్చి గాంధీ సరోవర్, కాంప్లెక్స్‌లు కట్టడాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుండగా.. రూటు మర్చిన కాంగ్రెస్ సర్కార్ గుడులు, మసీదు, చర్చి నిర్మాణాలను తెరపైకి తీసుకొచ్చింది. రూ.2500 కోట్లతో సనాతన గుడుల కాంప్లెక్స్, మసీదు, గురుద్వారా, చర్చి నిర్మించాలని తాజాగా నిర్ణయించింది.
మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ పేదలను రోడ్డున పడేయాలని చూస్తోంది. తొలి దఫాలో 3 వేల ఎకరాల సేకరణకు సిద్ధమైన రేవంత్ ప్రభుత్వం తదుపరి కార్యాచరణు ప్రకటించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్.. వంటి నిర్మాణానికి ప్రజల నుండి వేల ఇళ్లను, భూములను సేకరిస్తే తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో పంథా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రార్ధన మందిరాలను అస్త్రంగా ఉపయోగించుకోవాలనుకుంటోంది.
బిగ్ బ్రేకింగ్!
మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌లో తదుపరి కార్యాచరణ ప్రకటించిన రేవంత్ రెడ్డి సర్కార్.
రూ.2500 కోట్లతో సనాతన గుడుల కాంప్లెక్స్, మసీదు, గురుద్వారా, చర్చి నిర్మించాలని తాజా నిర్ణయం.
హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి ప్రజల నుండి… pic.twitter.com/B39VKmVXQ6
— Telugu Scribe (@TeluguScribe) March 28, 2026
తాజాగా మూసీ సుందరీకరణలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టినవి ఇవే. మంచిరేవుల వద్ద ప్రపంచంలోనే అతి పెద్ద సనాతన టెంపుల్ కాంప్లెక్స్, పురానాపూల్ వద్ద అతి పెద్ద మసీదు, గౌలిగూడ వద్ద స్వర్ణ మందిరం తరహాలో అతి పెద్ద గురుద్వారా, నాగోల్ వద్ద అతి పెద్ద చర్చి నిర్మాణం చేపట్టాలని నిర్ణయం. వీటిన్నింటికి సుమారు రూ. 2500 కోట్లు వెచ్చించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. మూసీ శుద్ది చేయమంటే, దాన్ని వదిలేసి ఇవేం పనులు అని తెలంగాణ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.