TG CPGET 2024 | ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్రవ్యాప్తంగా ఎంఈడీ, ఎంపీఈడీ సీట్ల చివరి దశ భర్తీకి షెడ్యూల్ విడుదల చేసినట్లు టీజీ సీపీజీఈటీ-2024 కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు అభ్యర్థులు ఈ నెల 18వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. 18వ తేదీన వెరిఫికేషన్ వివరాలను వెల్లడిస్తామన్నారు.
19,20 తేదీలలో వెబ్ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలని, 20వ తేదీన ఎడిట్ చేసుకోవచ్చన్నారు. ప్రాథమిక సీట్ల కేటాయింపు జాబితాను 22వ తేదీన విడుదల చేస్తామని, అభ్యర్థులు తమకు కేటాయించిన కళాశాలలో 26వ తేదీలోగా రిపోర్టు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఇతర వివరాలకు అభ్యర్థులు తమ వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Osmania University | డిగ్రీ కోర్సుల ఇన్స్టంట్ పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాల విడుదల
Patnam Narender Reddy | పోలీసులు నా పేరుతో ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పు : పట్నం నరేందర్ రెడ్డి
TGPSC | గ్రూప్-4 ఫలితాలు విడుదల