నల్లబెల్లి, మార్చి 26 : టెన్త్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్టు గుర్తించిన డీఈవో ఏడుగురు ఇన్విజిలేటర్లను తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా నల్లబెల్లి జడ్పీహెచ్ఎస్తోపాటు కారుణ్యజ్యోతి పాఠశాలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. జడ్పీహెచ్ఎస్లో సోమవారం ముగ్గురు ఫ్లయింగ్ స్కాడ్స్ వచ్చి విద్యార్థులను చెక్ చేశారు.
ఒక విద్యార్థి జేబులో జవాబులకు సంబంధించిన చీటీల కట్ట కనిపించింది. సదరు విద్యార్థిని ఆరా తీసి, బాత్రూమ్ను పరిశీలించగా కుప్పలుగా నకలు చీటీలు వెలుగు చూశాయి. దీనిపై స్కాడ్స్ డీఈవోకు ఫిర్యాదు చేశారు. స్పందించిన డీఈవో జ్జానేశ్వర్ జడ్పీహెచ్ఎస్లో విధులు నిర్వర్తిస్తున్న ఏడుగురు ఇన్విజిలేటర్లను తొలగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ఎంఈవో అనురాధను వివరణ కోరగా డీఈవో ఆదేశాల మేరకు ఇన్విజిలెటర్లను తొలగించి వారి స్థానంలో వేరేవారిని నియమించినట్టు తెలిపారు.