Tenth Exam Fee | హైదరాబాద్ : రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పాఠశాల విద్యాశాఖ పొడిగించింది. ఈ నెల 20వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించొచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఆలస్య రుసుము రూ.50తో ఈ నెల 21 నుంచి 29 వరకు అవకాశం కల్పించింది. రూ.200 లేట్ ఫీజుతో డిసెంబర్ 2 నుంచి 11 వరకు అవకాశం ఇచ్చింది. రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 నుంచి 29 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.