తొర్రూరు, నవంబర్ 20 : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చర్లపాలెం, కంఠాయపాలెంలో గురువారం హైలెవెల్ బ్రిడ్జిలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వరంగల్ ఎంపీ కడియం కా వ్య, ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, టీపీసీసీ ఉ పాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మీడియాతో మాట్లాడుతుండగా.. స్థానిక మహిళ ముందుకొచ్చి తన సమస్యను చెప్పే ప్రయత్నం చేశారు.
‘మాకు ఇల్లు లేదు. సొంత ఖర్చుతో సగం ఇల్లు కట్టుకున్నా.. అయినా, నాకు ఇందిరమ్మ ఇల్లు ఎందుకు మంజూరు కాలేదు?’ అని ఝాన్సీరెడ్డి, ఎమ్మెల్యే యశస్వినీరెడ్డిని ప్రశ్నించారు. ఆమె మాట్లాడుతుండగానే అక్కడున్న కొంద రు నాయకులు అడ్డుకునేందుకు యత్నిం చి, పకకు నెట్టడంతో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. మహిళకు అవకాశం ఇవ్వకుండా అడ్డుకోవడంపై గ్రామస్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తన మంచిది కాదని మండిపడ్డారు.