ఆసిఫాబాద్: ఫుడ్ పాయిజన్‌తో మరణించిన వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ (Shailaja) స్వగ్రామం బాదాలో పోలీసులు భారీగా మోహరించారు. శైలజ మృతదేహం ఆసిఫాబాద్ జిల్లా బాదా గ్రామానికి చేరుకున్నది. దీంతో ఆమె బంధువుల, గ్రామస్తులు అంబులెన్స్‌ను చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. ఆమె డెడ్‌బాడీని అందులోని నుంచి దించకుండా అడ్డుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారందరిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని అడుగడుగునా మోహరించారు. గ్రామంలోకి ఇతరులు ఎవరూ రాకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు. సరైన ధృవపత్రాలు చూపిన తర్వాతే గ్రామానికి అనుమతిస్తున్నారు. మీడియాపై ఆంక్షలు విధించారు.
కాగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న ఎమ్మెల్యే కోవా లక్ష్మిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన ఎమ్మెల్యే.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తనను ఎందుకు వెళ్లనీయడం లేదని ప్రశ్నించారు. బాదాకు వెళ్లడానికి ఎవరికీ అనుమతి లేదని స్పష్టం చేశారు. సోమవారం రాత్రి ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివాసంలోకి చొరబడిన పోలీసులు అక్రమంగా హౌస్ అరెస్టు చేశారు.
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ నివాసంలోకి చొరబడి అక్రమంగా హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
ఆసిఫాబాద్ వాంకిడి గిరిజన స్కూల్ ఫుడ్ పాయిజన్ కావడంతో నిమ్స్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ విద్యార్థిని శైలజ మృతి చెందడంతో వారి కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్తున్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ… https://t.co/TokXj3mq0b pic.twitter.com/jQOJiJTxqZ
— Telugu Scribe (@TeluguScribe) November 25, 2024
కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతతో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడిన విద్యార్థిని శైలజ(14) మృతి చెందింది. హైదరాబాద్ నిమ్స్‌లో 23 రోజుల పాటు చికిత్స పొందిన శైలజ పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించారు. కానీ సోమవారం శైలజ తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు స్పష్టంచేశారు. అక్టోబర్ 30న వాంకిడి గిరిజన గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 64 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతతకు గురైన విద్యార్థినులు ఇ మహాలక్ష్మి, కే జ్యోతి, సీ శైలజను ఈ నెల 5న నిమ్స్ దవాఖానలో చేర్చారు. ఇద్దరు విద్యార్థ్ధినులు కోలుకోగా 14న డిశ్చార్జి అయ్యారు. శైలజ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతూ వచ్చింది. కల్తీ ఆహారం ఆమె ఊపిరితిత్తులు, మూత్రపిండాలపై ప్రభావం చూపింది. ఈ నెల 5న ఐసీయూకు తరలించారు. పరిస్థితి మరింత విషమించడంతో ఆర్‌ఐసీయులో చికిత్సను అందించారు. కానీ వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. శైలజ సోమవారం తుదిశ్వాస విడిచింది.