నయనతారపై అనుచిత వ్యాఖ్యలు
మహిళల భద్రతపై జరిగిన ఓ నిరసన ర్యాలీలో పాల్గొన్న ఏఐఏడీఎంకే ఎంపీ ఒకరు సినీ నటి నయనతారను ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
- ఏఐఏడీఎంకే ఎంపీపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం
చెన్నై: మహిళల భద్రతపై జరిగిన ఓ నిరసన ర్యాలీలో పాల్గొన్న ఏఐఏడీఎంకే ఎంపీ ఒకరు సినీ నటి నయనతారను ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ని ఎద్దేవా చేసేందుకు నయనతారను ఎంపీ ప్రస్తావించడం వివాదాస్పదమైంది. స్టాలిన్ ఇటీవల తమ కలలను ప్రభుత్వంతో పంచుకోవాలని, వాటిని నెరవేర్చడానికి ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తుందని ప్రజలకు పిలుపునిచ్చారు. తమిళనాడులో మహిళలకు భద్రత, గౌరవం పెరగాలని డిమాండ్ చేస్తూ ఏఐఏడీఎంకే ఆధ్వర్యంలో మంగళవారం చెన్నైలో ఓ ర్యాలీ జరిగింది. ఇందులో పాల్గొన్న ఆ పార్టీ ఎంపీ సీవీ షణ్ముగం మాట్లాడుతూ మన సీఎం మన కలలను పంచుకొమ్మని చెప్పారు. నాకు నయనతార కావాలని చెబితే ఆయన(స్టాలిన్) నా కలను తీరుస్తారా? నయనతారతో నాకు పెండ్లి చేయించమని ఎవరైనా అడిగితే ఆయన ఆ కలను నెరవేరుస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. ఎంపీ వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

