న్యూఢిల్లీ: పార్సిళ్లు, ఇతర వస్తువుల బట్వాడాలో వేగాన్ని పెంచేందుకు భారత తపాలా శాఖ మూడు సరికొత్త సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 24 స్పీడ్ పోస్ట్, 24-స్పీడ్ పోస్ట్ పార్సెల్, 48-స్పీడ్ పోస్ట్ పేర్లతో సరికొత్త ప్రీమియం సేవల్ని మంగళవారం నుంచి ప్రారంభించింది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఢిల్లీలోని ఆశాశవాణి భవన్లో ఈ సేవల్ని లాంఛనంగా ప్రారంభించారు. వీటి ద్వారా 24గంటల్లో, 48 గంటల్లో పార్సిళ్లు ఇతర వస్తువుల డెలివరీకి పోస్టల్ శాఖ హామీ ఇస్తున్నది. దేశంలోని హైదరాబాద్, ముంబై, కోల్కతా, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఈ సేవల్ని ప్రారంభిస్తున్నట్టు ఈ మేరకు ప్రకటించింది.