రాజన్న సిరిసిల్ల, మే 7 (నమస్తే తెలంగా ణ): రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజ య్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు గృహనిర్బంధంతోపాటు ముందస్తు అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఇటీవల బండి సంజయ్ చేసిన అనుచిత, వ్యక్తిగత వాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. బండి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోని కేటీఆర్‌కు భేషరతుగా క్షమాపణలు చెప్పిన తర్వాతే సిరిసిల్లకు రావాలని డిమాండ్ చేశారు.
ఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి నివాసానికి వెళ్లి హౌస్ అరెస్ట్ చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ నివాసానికి వెళ్లి గృహనిర్బంధం చేశారు. తంగళ్లపల్లి నుంచి భారీగా బీఆర్ఎస్ నేతలు సిరిసిల్ల రగుడు శివారుకు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు.
సర్పంచ్ల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు మాట్ల మధు, మండ ల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పూర్మాణి రాజశేఖర్‌రెడ్డి, సర్పంచులు, బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో వారు తీవ్ర వాగ్వాదానికి దిగారు. వారిని సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గృహ నిర్బంధంలో ఉన్న చక్రపాణి, దార్ల సందీప్‌ను సైతం ఠాణాకు తీసుకెళ్లారు.