Munugodu | మునుగోడులో టెన్షన్ టెన్షన్..! ఎమ్మెల్యే చెప్పిన టైంకే వైన్ షాప్స్ ఓపెన్ చేయ్యాలని కాంగ్రెస్ నేతల వీరంగం : వీడియో
యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరం నెలకొంది.
హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన టైమింగ్స్ మేరకే మద్యం దుకాణాలు నడుపాలని వైన్ షాప్ (Wine shops)యజమానులు, ఎక్సైజ్ అధికారులతో రాజగోపాల్ రెడ్డి అనుచరులు వాగ్వాదానికి దిగారు. సంస్థాన్ నారాయణపురం, మునుగోడు, చండూర్ మండల కేంద్రాల్లో వైన్స్ షాప్స్ ముందు కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఆదేశాల మేరకు మధ్యాహ్నం ఒకటి తర్వాతనే వైన్సులు తెరవాలని మద్యం దుకాణాల యజమానులను కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. కాగా, మునుగోడు (Munugodu) నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్స్, ఎక్సైజ్ శాఖ అధికారులు(Excise officials) దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. సంస్థాన్ నారాయణపూర్‌లో రాజగోపాల్ రెడ్డి అనుచరులు మూసివేసిన వైన్ షాపులను అధికారులు శుక్రవారం దగ్గరుండి తెరిపించారు. ఎక్సైజ్ శాఖ అధికారుల పహారాలో ఉదయం నుండి మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి.
మునుగోడులో టెన్షన్ టెన్షన్..!
వైన్ షాప్ యజమానులతో, ఎక్సైజ్ అధికారులతో వాగ్వాదానికి దిగుతున్న రాజగోపాల్ రెడ్డి అనుచరులు
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం, మునుగోడు, చండూర్ మండల కేంద్రంలల్లో వైన్స్ ముందు కాంగ్రెస్ నాయకుల ఆందోళన
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి… https://t.co/hW4xUV217b pic.twitter.com/6GeyP5mfAn
— Telugu Scribe (@TeluguScribe) January 23, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

