హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ వ్యాపార సముదాయాలను అద్దె ప్రాతిపదికన కేటాయించేందుకు సంస్థ సిద్ధమైంది. నిరుద్యోగులు, స్థానిక వ్యాపారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి కోరారు. బస్ స్టాండ్లు, కాంప్లెక్స్‌ల్లో అద్దె ప్రాతిపదికన వ్యాపారాలు చేసుకోవడానికి ఆర్టీసీ ఏర్పాట్లు చేసిందని తెలిపారు.
ఆర్టీసీ బస్ స్టాండ్లలో హోటళ్లు, ఫుడ్ కోర్టులు, సూపర్ మారెట్లు, బ్రాండెడ్ షోరూమ్‌ల నుంచి చిన్న తరహా దుకాణాల వరకు అన్ని రకాల వ్యాపారాలు చేసుకోవచ్చంటూ ప్రకటన విడుదల చేశారు. అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలు, డిపోల పరిధిలో ఉన్న ఈ ఖాళీ వ్యాపార సముదాయాల వివరాలను సంస్థ అధికారిక వెబ్సైట్ tgsrtc.telangana.gov.inలో పొందుపరిచింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తు తం ఖాళీగా ఉన్న 694 షాపులకు త్వర లో టెండర్లు పిలుస్తున్నట్టు వివరించింది.