హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): మహిళా సంఘాలకు కేటాయించిన వెయ్యి మెగావాట్ల సో లార్ ప్లాంట్ల టెండర్లను త్వరలోనే ఖరారు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్ నుంచి మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో కలిసి కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి జిల్లాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు 150 ఎకరాలకు తగ్గకుండా స్థలాన్ని సేకరించాలని తెలిపారు.