హైదరాబాద్, ఆగస్టు5 (నమస్తే తెలంగాణ): కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకం (ఎన్‌కేఎల్‌ఐఎస్) పనుల కోసం టెండర్లను ఆహ్వానించేందుకు నీటిపారుదల శాఖ సిద్ధమైంది. రెండు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టాలని, ఈ నెల 9 నుంచి టెండ ర్లు స్వీకరించాలని నిర్ణయించింది. ఉ మ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాల్లో ని లక్ష ఎకరాలకు సాగునీటితోపాటు నారాయణపేట జిల్లాలో తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఎన్కేఎల్ఐఎస్ను ప్రభుత్వం ప్ర తిపాదించింది.
దీనికోసం రూ.4,350 కోట్ల అంచనా వేసింది. ఈ మేరకు పథకం పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే శం కుస్థాపన చేయగా, ఇటీవల బడ్జెట్లో కూడా ప్రభుత్వం దాదాపు రూ.610 కోట్లను కేటాయించింది. పాంచ్దేవ్ బండ పంప్‌హౌస్ నుంచి బీమా పథకంలో భాగంగా నిర్మించిన భూత్పూర్ జలాశయానికి, అక్కడి నుంచి ఊట్కూరు చెరువుకు తరలించే పనులను ప్యాకేజీ 1 కింద చేపట్టనున్నారు. ఊట్కూరు చెరువు నుంచి జయమ్మ చెరువుకు, అకడి నుంచి కనుకుర్తి చెరువుకు నీటిని తరలించే పనులను ప్యాకేజీ 2 కింద చేపట్టనున్నారు. ఒక్కో ప్యాకేజీ పనులకు దాదాపు రూ.1,100 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు.
ఉప్పొంగుతున్న కృష్ణమ్మ
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు స్థిరంగా భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టుకు 3.90 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండగా, దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామ ర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 294 టీఎంసీలకు చేరుకున్నది. 16 గేట్లను ఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు గోదావరిలో ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు వరద స్వల్పంగా కొనసాగుతున్నది. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుం చి సాగునీటి అవసరాలకు సంబంధించి ఇం డెంట్‌ను ఇవ్వాలని ఇరు రాష్ట్రాలకు తాజాగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు లేఖ రా సింది. 12 టీఎంసీలు కావాలని బోర్డుకు ఏపీ ఇండెంట్ సమర్పించినట్టు సమాచారం.