Solar Power Plants | హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన సోలార్ విద్యుత్తు ప్లాంట్లపై స్పష్టతలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పీఎం కుసుమ్ స్కీమ్‌లో భాగంగా రాష్ట్రంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు కల్పించింది.
1000 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటు లక్ష్యంగా ప్లాంట్ల ఏర్పాటుకు టీజీ రెడ్కో టెండర్లు ఆహ్వానించింది. కానీ టెండర్ల ప్రక్రియ ముందుకు సాగడంలేదు. బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే పెట్టుబడి రాబట్టుకోవడం కష్టమేనని వాదనలు వినిపిస్తున్నాయి. స్కీమ్‌పై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.