తానూర్, అక్టోబర్ 2 : కాలం కలిసి రాక.. అప్పు లు భారమై ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. తానూర్కు చెందిన రైతు జాదవ్ బాలాజీ (35) 20 ఎకరాల భూమి ని కౌలుకు తీసుకున్నాడు. సోయా వేయగా పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలు పడ్డాయి.
పంట నేలమట్టం కావడం, దిగుబడి రాదేమోనని బెంగ, తెచ్చిన రూ.12 లక్షల అప్పు ఎలా కట్టాలో తెలియక మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలాజీకి కొడుకు, కూతురు ఉన్నారు. భార్య రూప ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రమేశ్ తెలిపారు.