హసన్పర్తి, డిసెంబర్ 5 : అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేటలో శుక్రవారం జరిగింది. ఎస్సై దేవేందర్ కథనం ప్రకారం.. మండలంలోని దేవన్నపేటకు చెందిన జనుగాని నాగరాజు(35) గీత కార్మికుడిగా పని చేస్తున్నాడు. రేండేండ్ల నుంచి కొంత భూమిని కౌలుకు తీసుకొని మిరుప, పత్తి పంటలు సాగు చేశా డు. ఆశించిన దిగుబడి రాక అప్పు ల పాలయ్యాడు. రూ.6 లక్షల 7లక్షల వరకు అప్పులు కావడంతో తర చూ వేదన పడుతుండేవాడు. తెచ్చి న అప్పులకు వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితిలో నిత్యం తన భార్యతో అప్పుల విషయం చెప్పుకుంటూ కుమిలిపోయేవాడు. నాగరాజు ఇటీవల అయ్యప్పమాల ధరించాడు. దేవన్నపేట ఔటర్ రింగు రోడ్డు వద్ద కుటీరంలో ఉంటూ ప్రతి రోజూ పూజచేసుకొని నుంచి ఇంటికి వెళ్లేవాడు. శుక్రవారం ఉదయం కల్లు గీయడం కోసం వెళ్లిన నాగరాజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
పాము కాటుతో రైతు మృతి
మందమర్రి, డిసెంబర్ 5: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం చిర్రకుంట గ్రామానికి చెందిన రైతు కంది ముకుందరెడ్డి (60) పాము కాటుతో మృత్యువాత పడ్డాడు. ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. చిర్రకుంటకు చెందిన ముకుంద రెడ్డి బుధవారం సాయంత్రం తన వరిని కోస్తుండగా పాము అతని ఎడమ కాలుపై కాటు వేసింది. గమనించిన తోటి రైతులు చికిత్స కోసం మంచిర్యాలలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ముకుంద రెడ్డికి భార్య పద్మ, కుమారుడు అరవిందరెడ్డి, కూతురు నవ్య ఉన్నారు.