వెంకటాపూర్, జూలై11 : అప్పులబాధతో కౌలురైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై చల్లా రాజు తెలిపిన కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం భావ్సింగ్పల్లికి చెందిన ల్యాదెళ్ల నరేశ్(35) రామ్నాయక్తండాకు చెందిన బానోత్ రతన్‌సింగ్‌కు చెందిన ఆరు ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నాడు. పంట పెట్టుబడితోపాటు కుటుంబ పోషణకు రూ.6 లక్షలు అప్పు చేశాడు.
వాతావరణం అనుకూలించక, దిగుబడి రాక అప్పు తీర్చలేనని బాధపడుతూ ఈ నెల 7న పొలం వద్ద నరేశ్ పురుగుల మందుతాగాడు. భార్యకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. హుటాహుటిన ఆమె గ్రామస్థులతో కలిసి వెళ్లి నరేశ్‌ను భూపాలపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి వరంగల్ ప్రైవేటు దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.