గీసుగొండ, జూన్ 5: అప్పుల బాధ తట్టుకోలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని కొమ్మాల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గడ్డమీది అశోక్ (42) నాలుగేండ్లుగా గ్రామ శివారులో మూడెకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. అందులో పత్తి వేయగా పంట సరిగా పండలేదు. దీంతో పెట్టుబడి కోసం తెచ్చిన రూ.5 లక్షల అప్పు ఎలా తీర్చాలని మనస్తాపానికి గురై పొలం వద్ద గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ్డాడు. ఎంజీఎం దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.