న్యూఢిల్లీ: భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో మొదటి విడత ఉమ్మడి ప్రకటనను నాలుగైదు రోజుల్లో ఖరారు చేసి సంతకం చేసే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి పీయూష్ గోయల్ గురువారం తెలిపారు.
ఈ సంతకాలు జరిగాక భారత్‌పై సుంకాలను 18 శాతానికి తగ్గించే కార్యనిర్వాహక ఉత్తర్వును అమెరికా ప్రభుత్వం జారీ చేస్తుందని ఆయన వెల్లడించారు.