న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన విమాన తయారీ సంస్థ ‘బోయింగ్’ తన డిఫెన్స్ విభాగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతను చేపట్టింది. సైప్లె చైన్లో పనిచేస్తున్న దాదాపు 300 మందిని విధుల నుంచి తొలగిస్తున్నది.
ఎంతమందిపై దీని ప్రభావముంది, ఎవరెవరు ఉద్యోగాలు కోల్పోయారన్న విషయాలు మరికొద్ది రోజుల్లో బయటకు రానున్నట్టు ఈ అంశంతో సంబంధమున్న ఓ వ్యక్తి మీడియాకు తెలిపారు.