జమ్మికుంట, ఫిబ్రవరి 7 : దిగుబడి రాక .. పెట్టుబడి అప్పులు తీర్చలేకపోతున్నాననే మనస్తాపంతో ఓ కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలు.. విలాసాగర్కు చెందిన నెల్లి శంకరయ్యకు భార్య లక్ష్మి, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. పెద్ద కొడుకుకు దివ్యాంగుడు. శంకరయ్య గ్రామంలో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటూ, కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొంత పత్తి, మరికొంత వరి సాగు చేస్తున్నాడు. సాగు కోసం రూ.5 లక్షల వరకు అప్పుచేశాడు. పంట దిగుబడిరాక అప్పులు పెరిగి పోవడంతో మనస్తాపం చెందిన శంకరయ్య శుక్రవారం పొలం వద్ద పురుగుల మందుతాగాడు.