నిజామాబాద్ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి పది రోజుల్లో పది టీఎంసీ నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 30 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇందులో మూడు టీఎంసీలు కాలేశ్వరం జలాలు ఉండగా… మిగిలినవి గోదావరి పరివాహక ప్రాంతం నుంచి వస్తున్న వరదగా నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పోచంపాడు ప్రాజెక్టుకు ఎగువ నుంచి 23 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. ముప్కాల్ పంప్ హౌస్ నుంచి 4300 క్యూసెక్కుల కాలేశ్వరం జలాలను ఎత్తిపోస్తున్నారు.