హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి వార్షిక పరీక్షలను మార్చిలో నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మార్చి మూడోవారంలో ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల ఇంటర్ పరీక్షల తేదీలను ఇంటర్‌బోర్డు ప్రకటించింది.
ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టంచేసింది. ఏటా ఇంటర్ పరీక్షలు ముగిసే రెండురోజుల ముందే పదో తరగతి పరీక్షలు ప్రారంభంకావడం ఆనవాయితీగా వస్తున్న ది. ఈక్రమంలో మార్చి 16లేదా 18 తేదీలను అధికారులు పరిశీలిస్తున్నారు.