ములుగు, మే 10 (నమస్తేతెలంగాణ): మావోయిస్టుల ఏరివేతలో భాగంగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహ ద్దు రాష్ర్టాల్లోని కర్రెగుట్టల్లో 21 రోజులు గా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్‌కు బ్రేక్ పడినట్టు తెలుస్తున్నది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కర్రెగుట్టల్లో ఉన్న పోలీస్ బలగాలను వె నక్కి పిలిచినట్టు సమాచారం.
సీఆర్పీఎఫ్ కోబ్రా జవాన్లు తమ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశాలు చేసినట్టు తెలిసింది. ఛత్తీస్‌గఢ్ వైపు సీఆర్పీఎఫ్-217, 81, 86 బెటాలియన్లు, జీఆర్జీ, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్ ఆధ్వర్యంలో కగార్ ఆపరేషన్‌ను యథావిధిగా చేపట్టనున్నట్టు తెలిసింది.