Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఇటీవల అకాల వర్షాలతో కాస్త బ్రేక్ ఇచ్చినా.. తిరిగి ప్రతాపం చూపుతున్నాడు. మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిప్పుల కుంపటిని తలపిస్తున్నది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిన నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
29 జిల్లాల్లో 42 డిగ్రీలు దాటగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు పలు జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు పడొచ్చని పేర్కొంది.