ఆదిలాబాద్: మరో వారం పదిరోజుల్లో చలికాలం ముగియనుంది. అయినా ఆదిలాబాద్ జిల్లాలో చలిపులి పంజా విసురుతున్నది. జిల్లా వ్యాప్తంగా ప్రజలను వణికిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో చలితీవ్రత పెరిగిపోయింది. దీనికితోడు చల్లని గాలులు వీస్తుండటంతో ఉదయం 10 గంటలైనా ఇంట్లోంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు.

కొండ ప్రాంతాలు, జాతీయ రహదారులపై, గ్రామాలు, వాగులను పొగమంచు కమ్ముకోవడంతో చలి మరింత పెరిగిపోయింది. దీంతో ప్రజలు మళ్లీ స్వెటర్లు, చలి మంటలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక వృద్ధులు, చిన్న పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చలికి వణికిపోతున్న వారు బయటకు రాకుండా ఇంటికి పరిమితమయ్యారు.
