Telangana Bhavan | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ) : కశ్మీర్ ఎస్‌యూ, శ్రీనగర్ ఎన్ఐటీ, పంజాబ్‌లోని ఎల్ఎఫ్ యూ, ఐఐటీ జమ్ములో రెండు తెలుగు రాష్ర్టాల విద్యార్థులు ఎంతోమంది చదువుతున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బిక్కుబిక్కుమం టూ స్వస్థలాలకు చేరుతున్నారు.
శనివారం ఐఐటీ జమ్ములోని 8 మంది తెలంగాణ విద్యార్థులు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అధికారులు 011-23380556, 9871999044, 971387500, 9643723157, 9949351270 హెల్ప్‌లైన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.